టాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ నటిని డ్రగ్స్ ఆరోపణల్లోకి లాగుతున్నారు కొందరు. ఆ నటికి, పలువురు హీరోయిన్లతో సన్నిహిత సంబంధాలున్నాయి. పైగా సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల కుటుంబాలతోనూ ఆమెకు పరిచయాలు గట్టిగానే వున్నాయి. ఆమె డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా, చాలామందికి అలవాటు చేసిందంటూ.. కొన్ని గాసిప్స్ సోషల్ మీడియాలోనూ, డిజిటల్ మీడియాలోనూ సర్క్యలేట్ అవుతున్నాయి. ఎవరా నటి.? అన్నది పక్కన పెడితే, ఇలాంటి గాసిప్స్ చాలామందిపై వినిపిస్తున్నాయి.
గతంలో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నవారినీ, ఇప్పుడు లైవ్‌ులైట్‌లోకి తీసుకొస్తున్నారు డ్రగ్స్ కేసుకి సంబంధించి. కాగా, జరుగుతున్న దుష్ప్రచారంపై సినీ పరిశ్రమ కూడా సీరియస్‌గా స్పందించనున్నట్లు సమాచారం. ఆయా సినీ ప్రముఖులు వ్యక్తిగతంగా స్పందించాలా.? లేదంటే, మొత్తంగా సినీ పరిశ్రమ స్పందించాలా.? అన్నదానిపై టాలీవుడ్ పెద్దలు లోతుగా చర్చిస్తున్నారట. కొందరు వ్యక్తులు తప్పుదోవలో నడిస్తే.. దాన్ని సినీ పరిశ్రమకు ఆపాదించడం ఎంతవరకు సబబు.? అన్న ప్రశ్న పలువురు సినీ ప్రముఖుల నుంచి వస్తోంది. అలాగని, సినీ పరిశ్రమకు డ్రగ్స్‌తో లింకు లేదు.. అని గట్టిగా కుండబద్దలుగొట్టేయడానికి వీల్లేని పరిస్థితి.
టాలీవుడ్‌లోనూ అరెస్టులు తప్పవు.. అంటూ జరుగుతున్న ప్రచారం మాత్రం, కొందరికి ఇబ్బందికరంగానే మారింది. కరోనా లాక్‌డౌన్ నుంచి కొంత ఉపశమనం దక్కడంతో ఇప్పుడిప్పుడే సినిమా షూటింగులు పునఃప్రారంభమయ్యాయి. ఇంతలోనే డ్రగ్స్ రగడ తెరపైకి రావడం సినీ పరిశ్రమను మరింత ఇరకాటంలో పడేస్తోంది.