దుబాయ్ పోలీసులు క్లియరెన్స్ ఇచ్చేశారు

మరిన్ని వార్తలు

దాదాపు రెండు రోజుల నిరీక్షణ తరువాత శ్రీదేవి మృతదేహం ముంబైకి ఇంకొన్ని గంటల్లో చేరుకోనుంది. దీనికి సంబంధించి దుబాయ్ పోలిసుల నుండి అధికారిక ప్రకటన వెలువడింది. 

ఆ ప్రకటన సారంశామేమిటంటే- శ్రీదేవి మరణానికి సంబందించిన అన్ని కోణాల్లో విశ్లేషణ ముగిసింది అని అలాగే ప్రతి కేసులో అనుసరించే నిబంధనలని పాటించడం జరిగింది. దీనితో శ్రీదేవి మరణం వెనుక మిస్టరీ ఉందంటూ ఛానల్స్ వార్తలు రావడంతో అలాగే దుబాయ్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంలో జాప్యం నెలకొనడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. 

ఇక ఇప్పుడు దుబాయ్ మీడియా విడుదల చేసిన ప్రకటనతో ఇక్కడ ప్రచారంలో ఉన్న వార్తలన్నీ కొట్టుకుపోయాయి. ఈ రాత్రికి శ్రీదేవి మృతదేహం ముంబైకి చేరుకున్నాక రేపు అంత్యక్రియలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS