మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడే. గతంలో 'ఓకే బంగారం' సినిమాతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. 'మహానటి'తో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమా మంచి విజయం అందుకుంది. దుల్కర్‌కి మంచి పేరొచ్చింది. ఇదిలా ఉండగా ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో లేటెస్టుగా హిందీలో ఓ సినిమా చేస్తున్నాడు. 'కార్వాన్' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్.
దుల్కర్ సల్మాన్‌తో పాటు, ఇర్ఫాన్ ఖాన్, మిథిలా పాల్కర్ ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి కొబ్బరి బొండాలు తాగుతున్నట్లుగా ఉన్న ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వీరి పక్కనే ఓ కారు పార్క్ చేసి ఉంది పోస్టర్‌లో. ఇంతకీ ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటారా? 'త్రీ లాస్ట్ సోల్స్ టూ డెడ్ బోడీస్ ఎ జర్నీ ఆఫ్ లైఫ్ టైమ్'. ఇదీ ఈ సినిమా కాన్సెప్ట్ అన్న మాట. జర్నీ నేపథ్యంలో సాగే చిత్రమిది అని పోస్టర్‌నీ, కాన్సెప్ట్‌నీ బట్టి తెలుస్తోంది.
ముగ్గురు విభిన్న మనస్తత్వాలున్న వ్యక్తులు, వారి ప్రయాణానికి సంబంధించి ఈ సినిమాలో చూపించనున్నారట. ప్రతీ సన్నివేశం చాలా హృద్యంగా తెరకెక్కించనున్నారట డైరెక్టర్ ఆకాష్ ఖురానా. ఆగష్టు 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు. కాన్సెప్ట్ బేస్‌డ్ మూవీస్ బాగా సక్సెస్ అవుతున్న ఈ తరుణంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఈ 'కార్వాన్' చిత్రం ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలిక.