'డీజె' ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'దువ్వాడ జగన్నాధమ్‌'. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్నీ డిఫరెంట్‌ గెటప్‌లో కనిపిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. బ్రాహ్మణ యువకుడిగా బన్నీ నటిస్తున్నాడు ఈ చిత్రంలో తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలయ్యింది. ఆ లుక్‌లో అల్లు అర్జున్‌ స్కూటర్‌పై కూరగాయలు తీసుకుని బయల్దేరాడు. అయితే బన్నీ లుక్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతవరకూ ప్రీ లుక్స్‌ సోషల్‌ మీడియాలో సందడి చేశాయి. అయితే తాజాగా వచ్చిన ఈ లుక్‌ మాత్రం ఫ్యాన్స్‌ని నిరాశపరిచిందంటున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్‌ అంటే పవర్‌ పుల్‌ లుక్‌, డిఫరెంట్‌ స్టైల్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు ఫ్యాన్స్‌. అలాంటిది బన్నీ ఈ లుక్‌లో స్టైలిష్‌గా లేడు. కానీ డిఫరెంట్‌గానే కనిపిస్తున్నాడులెండి. అయినా బన్నీది ఈ సినిమాలో కూల్‌గా ఉండే పంతులు క్యారెక్టర్‌ కదా. అందుకేనేమో ఇలా కనిపిస్తున్నాడు. లేదంటే, ఫస్ట్‌లుక్‌ ఇలా రిలీజ్‌ చేసి, నెక్స్ట్‌ లుక్‌లో అసలు సిసలు బన్నీని చూపిస్తారేమో. ఇంతవరకూ తన డిఫరెంట్‌ స్టైల్స్‌తో ఆకట్టుకున్న బన్నీ, తొలిసారిగా ఈ తరహా క్యారెక్టర్‌తో వస్తున్నాడు. 'అదుర్స్‌' సినిమాలో ఎన్టీఆర్‌ ఇదే పాత్రలో కనిపించి నవ్వులు పూయించాడు. మరి ఈ ప్రయత్నంలో బన్నీ ఏం చేస్తాడో అంటూ అంచనాలు వేస్తున్నారు సినీ జనం. దిల్‌ రాజు నిర్మాణంలో వస్తోన్న ఈ చిత్రంలో ముద్దుగుమ్మ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS