ఏ క్షణంలో దువ్వాడ జగన్నాథమ్ టీజర్ రిలీజ్ అయిందో కానీ ఒక పెద్ద కాంట్రవర్సీతో మొదలయ్యింది. అదే మీ అందరికి తెలిసిన డిజ్-లైక్స్ సంగతి.
ఈ డిజ్-లైక్స్ విషయం ఎంత దూరం పోయిందంటే చివరికి ఈ టీజర్ ని "మోస్ట్ డిజ్-లైక్డ్ టీజర్" అనే లెవల్ కి! ఇప్పటికీ ఈ టీజర్ 5 మిలియన్ వ్యూస్ దాటి ఒక రికార్డు నెలకోల్పితే అదే సమయంలో 95వేల డిజ్-లైక్స్ తో Most Disliked Teaser గా పిలవబడుతోంది. దీనికి పవన్ ఫ్యాన్స్ కారణం అని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి!
ఇదిలా ఉంటే అజిత్ సినిమా వేదాళం 70 వేల చిలుకు డిజ్-లైక్స్ తో రెండో స్థానంలో ఉంది. ఆసక్తికర విషయమేమిటంటే, వేదాళం సినిమా అజిత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీనిబట్టి టీజర్ likes/dislikes కీ సినిమా hit/flop కీ ఏమాత్రం సంబంధం లేదు అని. చూద్దాం.. డిజే కూడా వేదాళం లాగా Most Disliked నుండి బిగ్గెస్ట్ హిట్ అవుతుందేమో!