దువ్వాడకి మొదలయిన పైరసీ చిక్కులు!

మరిన్ని వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం చిత్రం రిలీజ్ అయిన మూడురోజులకే పైరసీ చిక్కులు వచ్చిపడ్డాయి. 

అందుతున్న వివరాల ప్రకారం, దువ్వాడ జగన్నాధం చిత్రంలోని కొన్ని పాటలను, కీలకమైన సన్నివేశాలను అలాగే కొన్ని చోట్ల అయితే పూర్తి సినిమాని పేస్ బుక్ లో పోస్ట్ చేయడం జరుగుతున్నదట.

ఇప్పటికే DJ పైరసీ కి సంబంధించి కొన్ని లింక్స్ ని డిలీట్ చేసిన మళ్ళీ కొత్తవి వస్తూనే ఉన్నాయి అంటూ చిత్ర యూనిట్ కి సంబందించిన వారు వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

మొత్తానికి ఇటు కలెక్షన్స్ పరంగా బాగున్నా అటు పైరసీ పరంగా DJకి తిప్పలు తప్పడంలేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS