త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ,ఆ' ఘన విజయం సాధించింది. నితిన్, సమంత జంటగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని బాగా ఎంటర్టైన్ చేసింది. ఈ సినిమాకి కాన్సెప్ట్ ఒక ప్లస్ అయితే టైటిల్ మరో ప్లస్. 'అ,ఆ' అనే టైటిల్‌కే ఫస్ట్ ఆడియన్స్ ఎట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు అదే తరహాలో నైరా షా, నీరజ్ శ్యామ్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? గెస్ చేయండి. చెయ్యలేకపోతున్నారా? అయితే ఇదిగో.. ఈ సినిమా టైటిల్ 'ఇ,ఈ' బావుంది కదా. కొత్త టైటిల్ అదిరింది కదా. ఇదో డిఫరెంట్ లవ్‌స్టోరీ. త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అ,ఆ' పేటర్న్లోనే ఇంకొంచెం డిఫరెంట్‌గా ఈ సినిమా ఉండబోతోందట. 'అ,ఆ'లో అమ్మాయి పేరు అనసూయ రామలింగం ముందు రాగా, ఆనంద్ విహారి అని తర్వాత అబ్బాయి పేరు వస్తుంది. ఈ సినిమాలో రివర్స్. ముందు అబ్బాయి పేరు, తర్వాత అమ్మాయి పేరు. అయితే ఆ పేర్లేంటో మాత్రం ఇప్పుడు అడక్కండి. ఎందుకంటే జస్ట్ టైటిల్ ద్వారా ఈ చిక్కుముడిని ఇన్‌డైరెక్ట్‌గా విప్పారు కానీ, డైరెక్ట్‌గా పేర్లు చెప్పలేదండోయ్. టైటిల్ లోగో కూడా విచిత్రంగా అనిపిస్తోంది. 'ఇ' లెటర్ మీద ఓ టోపీ, 'ఈ' లెటర్ మీద అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ ఉన్నాయి. సో అలా ఈ డిఫరెన్స్‌ని చిత్ర యూనిట్ తెలియజేసిందన్న మాట. మొత్తానికి కొత్త నటీనటులతో, కొత్త కాన్సెప్ట్‌తో సరికొత్తగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఇ,ఈ' అని తెలుస్తోంది.