'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో గోదారి జిల్లా యాసతో ఆకట్టుకుని, ఏకంగా వర్మ సినిమాలో హీరోయిన్ అయిపోయిన ముద్దుగుమ్మ తేజస్వి, ఆ తర్వాత వరుస అవకాశాలతో అలరించింది. చెల్లెలి పాత్రల్లో, హీరోయిన్ పాత్రల్లో, హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లో ఏ క్యారెక్టర్‌కైనా తనదైన చిలిపితనంతో భలే ఒదిగిపోయింది ఈ ముద్దుగుమ్మ. అల్ట్రా మోడ్రన్వేర్లో హాట్ హాట్‌గా అలరించిన ఈ బ్యూటీ తాజాగా ఇలా చీరలో దర్శనమిచ్చింది. అన్ని కాస్ట్యూమ్స్ కన్నా శారీనే ఎక్కువ సెక్సీ అంటోంది. కట్టేలా కట్టాలే కానీ, శారీలో ఉన్న సెక్సప్పీల్ ఇంకే కాస్ట్యూమ్కీ రాదంటోంది. అందుకే ఇలా శారీలో తన అందాలను సెక్సీగా ఒలకబోసేస్తోందీ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ. మోడ్రన్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టమంటోంది. పక్కింటమ్మాయిలా కనిపించే ఈ ముద్దుగుమ్మ అన్ని రకాల ఫ్యాషన్స్నీ ఫాలో చేస్తేనే అసలైన కిక్కు అంటోంది.