ఈ నగరానికి ఏమైంది? స్పెషాలిటీ ఏంటంటే.!

By iQlikMovies - June 25, 2018 - 16:29 PM IST

మరిన్ని వార్తలు

'ఈ నగరానికి ఏమైంది?' ఈ మాట ఈ మధ్య బాగా పాపులర్‌ అయిపోయింది. ఏ సినిమా ప్రదర్శించినా, ధియేటర్‌లో ముందుగా ప్రసారమయ్యే వాణిజ్య ప్రకటన ఇదే. ఈ మాటపై ఎన్నో సెటైర్లు. కామెంట్లు, జోకులు అబ్బో చాలా వినేశాం. అయితే ఇప్పుడు ఇదే టైటిల్‌తో సినిమా రాబోతోంది. 

ఈ సినిమాని తెరకెక్కిస్తుందెవరో కాదు 'పెళ్లి చూపులు' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌. తొలి సినిమాతోనే హిట్‌ కొట్టాడు. అలాగే ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్‌ దేవరకొండకు మంచి పేరు దక్కింది. రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయాడీ యంగ్‌స్టర్‌. చాలా క్యాజువల్‌గా ఓ మిడిల్‌క్లాస్‌ తెలంగాణ అబ్బాయి స్టోరీ 'పెళ్లిచూపులు'. అయితే ఈ సారి తరుణ్‌ భాస్కర్‌ ఓ డిఫరెంట్‌ మూవీని తెరకెక్కిస్తున్నాడు. 

టైటిల్‌ చూస్తేనే తెలుస్తోంది కదా. తారాగణం కూడా ఎక్కువే. అయితే ఈ సినిమాలో నటించే నటీనటులు అంతా కొత్తవాళ్లే. షార్ట్‌ ఫిలింస్‌లో నటించిన అనుభవం ఉంది. షార్ట్‌ ఫిలిం నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. విశ్వక్సేన్‌, సాయి సుశాంత్‌, అభినవ్‌ గోమతం, వెంకటేష్‌ కాకుమాను, సిమ్రన్‌, అనీషా ఆంబ్రోస్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి తెలంగాణా మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈయనతో పాటు, యంగ్‌స్టర్స్‌ రానా, నాగచైతన్య, విజయ్‌ దేవరకొండ కూడా సందడి చేయనున్నారు. 

ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS