మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ ప్రజలకి సంబందించిన సమస్యలని ట్విట్టర్ వేదికగా వీలైనంతవరకు పరిష్కరిస్తుంటాడు. ఈ తరుణంలోనే కేటీఆర్ కి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఒక వర్థమాన నటి నుండి ఎదురైంది.
ఇంతకి ఆ ప్రశ్న వేసింది ఎవరంటే- ఈషా రెబ్బ, ఆమె ఏం అడిగిందంటే- “దేశంలో ప్లాస్టిక్ ని బ్యాన్ చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేకపోవడం చాలా విచారకరంగా ఉంది. దయచేసి దీని పైన దృష్టిపెట్టండి” అని కేటీఆర్ కి సూచన చేసింది.
దీనికి వెంటనే స్పందించిన మంత్రి గారు, “కేవలం ఒక బిల్లుని పాస్ చేయడంతో ప్లాస్టిక్ ని అరికట్టలేము అని చెబుతూ ప్లాస్టిక్ ని బ్యాన్ చేసేముందు అన్ని వర్గాల నుండి అభిప్రాయలు తీసుకునే అవసరం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రక్రియ మొదలైంది. అయిన ముందుగా మనందరిలో మార్పు వస్తే అరికట్టగలం” అని చెప్పుకొచ్చాడు.
కేటీఆర్ ఇచ్చిన సమాధానంకి స్పందిస్తూ- “మీలాంటి సామర్ధ్యం, మంచి చేయగల నాయకులు ఉండికూడా ఇలా అనడం భావ్యం కాదు. అనేక రంగాల్లో నెం 1 గా ఉన్న మన రాష్ట్రాన్ని ఈ అంశంలో కూడా నెం1 చెయ్యాలి అని కోరుకుంటున్నాను.”
మరి ఈషా కోరినట్టుగా తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ ఈ ప్లాస్టిక్ బ్యాన్ పైన ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారో అన్నది చూడాలి.