గ్లామర్‌ హద్దులు చెరిపేసిన తెలుగందం

మరిన్ని వార్తలు

తెలుగమ్మాయిలు గ్లామర్‌కి దూరం, టాలెంట్‌కి దగ్గర అనే ట్యాగ్‌లైన్‌కు మెల్లమెల్లగా అర్ధాలు మారిపోతున్నాయి. ఒక్కొక్కరుగా తెలుగమ్మాయిలు తమలోని గ్లామర్‌ యాంగిల్స్‌ని బయట పెడుతున్నారు. ఎక్స్‌పోజింగ్‌లో విపరీతంగా హద్దులు చెరిపేస్తున్నారు. 'గూఢచారి' సినిమాతో పరిచయమవుతున్న తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల ఆల్రెడీ సోషల్‌ మీడియాలో తన హాట్‌నెస్‌కు నో లిమిట్స్‌ అని నిరూపించేసింది. సినిమాలో కూడా బీభత్సం చేసేసిందని ప్రమోషన్స్‌ ద్వారా తెలుస్తోంది. 

ఇకపోతే నిన్న మొన్నటి దాకా ట్రెడిషనల్‌గా ఉంటూ, గ్లామర్‌కి దూరంగా ట్రెండీ అమ్మాయిగా కనిపించిన ఈషా రెబ్బ కూడా గ్లామర్‌ కంచెలు తెంచేసింది. తాజాగా సోషల్‌ మీడియాలో అమ్మడు పోస్ట్‌ చేసిన ఓ ఫోటో చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు. వైట్‌ అండ్‌ హాటెస్ట్‌ షార్ట్‌ కాస్ట్యూమ్‌లో అమ్మడి అందచందాలు మామూలుగా నిషా తెప్పించట్లేదండోయ్‌. 

కొందరు నిషా ఇది నువ్వేనా? ఇంత హాట్‌గానా? అంటుంటే, మరికొందరు ఈషా అసలు నీకేమైందింతలా.. అని కామెంట్స్‌ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ హాట్‌ బ్యూటీ 'బ్రాండ్‌ బాబు' చిత్రంలో నటిస్తోంది. మారుతి కథతో ప్రభాకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS