పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ సినిమాల్లో ఎక్కడో ఏదో మూల దేశభక్తికి సంబంధించిన అంశం కన్పించేది. అలా ఆయన యూత్‌ని తనవైపుకు తిప్పుకున్నారు. ఇప్పుడాయన బాటలోనే 'మేనల్లుడు' సాయిధరమ్‌తేజ కూడా అడుగులేస్తున్నట్టున్నాడు. 'జవాన్' పేరుతో సాయిధరమ్ తేజ నటిస్తున్న సినిమా టీజర్ విడుదలయ్యింది. దేశభక్తి అంటే కిరీటం కాదు, కృతజ్ఞత అని సాయిధరమ్ తేజ చెప్పిన డైలాగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' ఫేం మెహరీన్ కౌర్ పిర్జాదా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. బీవీఎస్ రవి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'పైసావసూల్' సినిమా కోసం డైరెక్టర్ పూరీ జగన్నాధ్ స్టంపర్ అనే కొత్త పదాన్ని టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ చెయ్యగా, 'జవాన్' కోసం ప్రిల్యూడ్ అనే పేరుని తీసుకొచ్చారు. నిడివి తేడా అంతే, ఏదన్నా సినిమా ప్రోమో కిందకే వస్తుంది. కొత్త పేర్లతో ఆకర్షించడం ఓ ట్రెండింగ్ ఇప్పుడు. ఆ కోవలోనే ఈ 'జవాన్' ప్రిల్యూడ్ కూడా ఆకర్షిస్తోంది. దిల్ రాజు సమర్పణలో అరుణాచల క్రియేటషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. కృష్ణ నిర్మాణంలో రూపొందుతోంది. బోర్డర్‌లో సైనికుడు దేశాన్ని ఎలా రక్షిస్తాడో అలాగే ప్రతీ కుటుంబానికి జవాన్‌లాంటోడు ఒకడుండాలి అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. టైటిల్‌తోనే సగం మార్కులు కొట్టేసిన సాయి ధరమ్ తేజ్ సినిమాలో కంటెన్ట్‌తో ఎన్ని మార్కులేయించుకుంటాడో చూడాలి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.