పవర్ స్టార్ గానే కాకుండా ఒక రాజకీయ పార్టీకి అధినేతగా సుపరిచుతుడైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ పాత్ర పై ఒక కీలక ప్రకటన చేశాడు.
వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి ఉద్దానం కిడ్నీ భాదితుల విషయంలో చొరవ చూపాలని కోరడం జరిగింది. ఇక ఇదే క్రమంలో ఆయనతో రాజకీయ సంబంధ చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తున్నది.
ఇక పవన్ పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండట్లేదు అన్ని అన్ని వైపుల నుండి విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఆయన వాటికి సమాధానం ఈ రోజు చెప్పేశాడు. రాబోయే అక్టోబర్ నుండి ఆయన సమయంలో రెండు నుండి మూడవ వంతు రాజకీయాలకే కేటాయించనున్నట్టు చెప్పాడు.
జనసేన తరపున కార్యకర్తల ఎంపిక అలాగే వారికి శిక్షణా తరగతులు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న నేపధ్యంలో వచ్చే అక్టోబర్ నాటికి ఇవి పూర్తి కానున్నాయి. కావున తను యాక్టివ్ పాలిటిక్స్ కి తెరలేపనున్నట్టు హింట్ ఇచ్చేశాడు.