పూజను డామినేట్‌ చేసిన ఈషారెబ్బ

మరిన్ని వార్తలు

'అరవింద సమేత' సక్సెస్‌ ఫంక్షన్‌లో గోల్డెన్‌ డ్రస్సులో పూజా హెగ్దే ధగధగలాడిపోయినా, ఆ మీటింగ్‌కి హాజరైన ఆడియన్స్‌ అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించింది మరో ముద్దుగుమ్మ ఈషారెబ్బ. కెమెరా కన్ను కూడా పూజా హెగ్దే కన్నా, ఈషా రెబ్బ పైనే ఎక్కువగా ఫోకస్‌ చేసింది.

 

ఎంతైనా తెలుగమ్మాయి కదా. ఆ మాత్రం ఎట్రాక్షన్‌ ఉంటుందిలే మరి. ఎన్టీఆర్‌ - పూజా హెగ్దే జంటగా తెరకెక్కిన 'అరవింద సమేత..' చిత్రం దసరా కానుకగా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తెలుగమ్మాయి ఈషా రెబ్బ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించిన సంగతి తెలిసిందే. సినిమా ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్రయూనిట్‌ హైద్రాబాద్‌లో ఘనంగా సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్‌ ఫంక్షన్‌లోనే ఈ ముద్దుగుమ్మలిద్దరూ తమ తమ అందమైన కాస్ట్యూమ్స్‌తో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. 

సినిమాలోనే కాకుండా, స్టేజ్‌పై కూడా వీరిద్దరూ తమ అందచందాలతో పోటీ పడ్డారు. ఈ సక్సెస్‌ వేడుకకు నందమూరి నటసింహం బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. అబ్బాయ్‌ ఎన్టీఆర్‌ నటించిన 'అరవింద సమేత..'కు ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్ష దేవుళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. వే

డుక చివరిలో బాలయ్య, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లకు నందమూరి అభిమానులు గజమాలతో సత్కరించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS