సినిమా స్టార్లతో ఫొటోలు తీయించుకోవాలని అందరికీ ఉంటుంది. మరి సినిమా వాళ్లకైతే..?? వాళ్లకీ ఫొటోల వ్యామోహం ఉంటుది. సెల్ఫీలు వచ్చాక.. అందరితోనూ ఫొటోలు తీయించుకుంటారు. తమని అభిమానించేవాళ్లతో, తాము అభిమానంచేవాళ్లతో సరదాగా ఫొటోలు తీయించుకోవడం మామూలే.
అయితే జగపతిబాబు మాత్రం ఇప్పటి వరకూ ఏ సినిమా హీరోతో ఫొటోలు దిగలేదట. తొలిసారి కావాలని ఓ ఫొటో తీయించుకున్నాడు. అది నందమూరి బాలకృష్ణ - ఎన్టీఆర్లతో కలసి. ఇన్నేళ్ల తన జీవితంలో ఎప్పుడూ సినిమావాళ్లతో ఫొటోలు తీయించుకోలేదని, తొలిసారి ఓ ఫొటో తీయించుకున్నానని, దానికి కారణం ఎన్టీఆర్, బాలయ్య అంటే తనకున్న అభిమానమే అని జగ్గూభాయ్ చెప్పుకొచ్చాడు. వాళ్లిద్దరినీ ఒకే వేదికపై చూడాలన్నది తన కోరిక అని, ఇన్నాళ్లకి అది తీరిందన్నాడు జగపతి.
అంతేకాదు.. నందమూరి అభిమానుల్నీ మెచ్చుకున్నాడు. నందమూరి అభిమానులంతా మంచివాళ్లని, వాళ్లంతా కలసి ఉండాలని తన మనసులో మాట బయటపెట్టాడు జగ్గూ భాయ్.