పాపం తెలుగమ్మాయ్‌.. మళ్ళీ షాక్‌ తగిలింది

మరిన్ని వార్తలు

అందానికి అందం, నటనకు నటన.. అన్నీ వున్నా, సరైన సక్సెస్‌ మాత్రం దక్కడంలేదు తెలుగమ్మాయ్‌ ఇషా రెబ్బాకి. 'అరవింద సమేత' సినిమాలో ఛాన్స్‌ రావడంతో ఎగిరి గంతేసిన ఇషా, ఆ సినిమా తనకు ఏమాత్రం గుర్తింపు తెచ్చిపెట్టకపోవడంతో డీలాపడింది. తాజాగా 'సుబ్రహ్మణ్యపురం' సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది ఇషా. ఇక్కడా ఆమెకు నిరాశే మిగిలింది. హీరోయిన్‌ కాదు, సపోర్టింగ్‌ యాక్ట్రెస్‌.. అంటూ రివ్యూల్లో ఇషా గురించి ప్రస్తావించడంతో ఆమె బాగా హర్ట్‌ అయ్యిందట.

నిన్న నాలుగు సినిమాలు విడుదల కాగా, అందులో 'సుబ్రహ్మణ్యపురం' కూడా ఒకటి. సుమంత్‌ హీరోగా నటించిన చిత్రమిది. నిఖిల్‌ హీరోగా వచ్చిన 'కార్తికేయ' తరహాలో ఇంట్రెస్టింగ్‌గా వుంటుందుకుంటే, సినిమా బోర్‌ కొట్టించేసిందనీ, కొత్తదనం ఏమాత్రం లేదనే కామెంట్స్‌ రివ్యూల్లో కన్పించాయి. సినిమా సంగతెలా వున్నా, హీరోయిన్‌ గురించి మరీ జాలితో కూడిన నెగెటివ్‌ కామెంట్స్‌ రావడంతో ఇషా బాగా హర్టయ్యిందట.

తనవరకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకునేందుకు ఇషా ప్రయత్నిస్తున్నా.. ఆమె ఆశించిన విజయాన్ని మాత్రం ఏ చిత్రమూ ఇవ్వలేకపోతోంది. 'సుబ్రహ్మణ్యపురం' సినిమా ప్రమోషన్స్‌లో ఒకింత ట్రెండీ లుక్స్‌తో కూడా హల్‌చల్‌ చేసింది ఇషా. ప్రయత్న లోపం లేకుండా కష్టపడుతున్న ఈ బ్యూటీకి టైమ్‌ ఎప్పుడు కలిసొస్తుందో ఏమో వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS