'ఎన్‌టిఆర్‌' బయోపిక్‌లో రాణా సీన్‌ ఎంత?

By iQlikMovies - October 04, 2018 - 08:00 AM IST

మరిన్ని వార్తలు

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర 'ఎన్‌టిఆర్‌' బయోపిక్‌లో దగ్గుబాటి రానా 'చంద్రబాబునాయుడు' పాత్ర పోషిస్తోన్న సంగతి తెల్సిందే. అంటే, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడి బయోపిక్‌లో, తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అధ్యక్షుడి పాత్ర అన్న మాట. ఎంతటి కీలకమైన పాత్ర కాకపోతే, రానా ఈ పాత్ర కోసం తన బరువుని చాలా కష్టపడి తగ్గించుకుంటాడు? అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 'ఎన్‌టిఆర్‌' బయోపిక్‌లో రానా కన్పించేది చాలా కొద్ది సేపు మాత్రమేనట. 

అయినాగానీ, ఆ పాత్రకు వున్న ప్రాధాన్యత దృష్ట్యా రానా, చాలా కష్టపడి బరువు తగ్గించుకున్నాడని తెలుస్తోంది. దర్శకుడు క్రిష్‌తో వున్న సాన్నిహిత్యమే చిన్న పాత్ర అయినా ఇందులో రానా చేయడానికి మరో కారణమని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ సమాచారాన్ని బట్టి అర్థమవుతోంది. స్వర్గీయ ఎన్టీఆర్‌ అల్లుడు చంద్రబాబు. కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ని తెలుగుదేశం పార్టీకి దూరం చేయాల్సి వస్తే, ఆ సమయంలో 'వెన్నుపోటు' అనే విమర్శల్ని చంద్రబాబు మోయాల్సి వస్తోంది. ఆ విమర్శల బరువు ఇంకా చంద్రబాబు భుజాల మీదనే వుంది. అందుకే ఆ అంశాన్ని టచ్‌ చేయకుండా, 'ఎన్‌టిఆర్‌' బయోపిక్‌ని రూపొందిస్తున్నారట. 

బాలకృష్ణ ఈ సినిమాలో స్వర్గీయ ఎన్టీఆర్‌ పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌ భామ విద్యా బాలన్‌, స్వర్గీయ ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకంగా కనిపించనున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాకి బాలకృష్ణ నిర్మాత కూడా. 2019 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్‌ని కన్‌ఫామ్‌ చేయగా, సినిమా రెండు పార్టులుగా రాబోతోందంటూ ప్రచారం జరుగుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS