పిండికొద్దీ రొట్టె. టాలెంట్ కొద్దీ.. రెమ్యునరేషన్. ఈ విషయంలో మరో మాటకు తావే లేదు. అయితే కొంతమంది మాత్రం... ఇవేం పట్టించుకోరు. `అడిగినంత ఇస్తేనే..` అంటూ షరతు పెడతారు. వాళ్ల దగ్గర బేరాల్లేవు. `నీ చేతిలో సినిమాల్లేవు కదా.. నీకు హిట్లు లేవు కదా` అంటే ఒప్పుకోరు. ఇషా రెబ్బా కూడా అదే తరహా. ఈ అమ్మడికి చేతిలో సినిమాల్లేవు. వెబ్ సిరీస్‌లవైపు దృష్టి పెడుతున్నా - పెద్దగా లాభం లేకుండా పోయింది.
అయితే వచ్చిన ఒకట్రెండు సినిమాల్ని కూడా పారితోషికం పేరుతో పోగొట్టుకుంటోంది. తాజాగా ఓ అగ్ర దర్శకుడి చిత్రంలో ఆఫర్ అందుకుంది. అయితే పారితోషికం నచ్చకపోవడంతో - చివరి క్షణాల్లో డ్రాప్ అయ్యింది. `పారితోషికం తగ్గించామంటే.. మరీ చులకన అయిపోతాం. మన విలువ మనం ఎందుకు తగ్గించుకోవాలి` అంటూ..? సన్నిహితుల దగ్గర లాజిక్ తీస్తోందట ఈషా. ఇదేం వ్యూహమో మరి..?!