'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో తెరంగేట్రం చేసిన పదహారణాల తెలుగమ్మాయి ఈషా రెబ్బ. 'అమీ తుమీ' సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. 'దర్శకుడు', 'అ' చిత్రాల్లో నటించింది. 'అ'లో విభిన్న తరహా క్యారెక్టర్‌లో నటించి వారెవ్వా అనిపించుకుంది. 'బ్రాండ్‌బాబు' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
డైరెక్టర్ మారుతి కథా, స్క్రీన్‌ప్లే, మాటలు అందించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఆశక్తిని పెంచుతోంది. బుల్లితెర నటుడు ప్రభాకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగష్టు 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈషారెబ్బా ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంలో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో నటిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ విషయం అటుంచితే, సహజంగానే సెలబ్రిటీస్‌పై రూమర్లు పుట్టుకొస్తూ ఉంటాయి.
ముఖ్యంగా హీరోయిన్స్‌పై రూమర్స్ అంటే ఆడియన్స్‌లో కూసింత ఆశక్తి ఎక్కువే. అయితే సెలబ్రిటీలు వాటిలో కొన్ని పట్టించుకుంటారు. కొన్ని పట్టించుకోరు. వీటి విషయంలో అమ్మడు ఈషా రెబ్బ ఏమంటోందంటే, రూమర్స్, గాసిప్స్ విషయంలో స్పందిస్తే, వాటికి విలువ ఇచ్చినట్లవుతుంది. అలాంటి వాటికి విలువిస్తూ పోతే, వాటికి బలం చేకూర్చినట్లువుతుంది. అందుకే గాసిప్స్ పట్ల స్పందించకుండా ఉండడమే మంచిదని తన అభిప్రాయంగా చెబుతోంది.
అమ్మడి అభిప్రాయం తెలుసుకుని అబ్బో ఈషా నువ్వెంత గడుసబ్బా అనకుండా ఉండలేకపోతున్నారు మరి.