ఈ మధ్య కాలంలో సమంత రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఆలోచన చేస్తోంది. గ్లామర్ పాత్రలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత, ఇప్పుడు ప్రయోగాత్మక చిత్రాకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారి కోడలయ్యాక సమంతలో చాలా మార్పులు వచ్చాయి.
నటనకు అయితే బ్రేక్ ఇవ్వలేదు కానీ, ఎంచుకునే పాత్రల్లో మాత్రం వైవిధ్యం చూపిస్తోంది. 'రంగస్థలం' సినిమాలో రామలక్ష్మి పాత్రనే తీసుకుంటే, పూర్తిగా డీ గ్లామర్ రోల్ అది. కానీ నటనకు ప్రాధాన్యమున్న పాత్ర. అలాగే 'మహానటి'లోని మధురవాణి అయినా, 'అభిమన్యుడు'లో జర్నలిస్ట్ పాత్ర అయినా. తాజాగా సమంత నటిస్తోన్న 'యూ టర్న్' చిత్రంలోనూ సమంతది హుందా అయిన పాత్రే కావడం విశేషం. ఇది కూడా జర్నలిస్టు పాత్రే.
ఇకపోతే తమిళంలో ప్రస్తుతం సమంత 'సీమరాజా' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం 'సిలంబం' అనే ఓ విద్య నేర్చుకుంటోం సమంత. సాంప్రదాయ పోరాట విద్య ఇది. ఫిట్‌నెస్‌కి సంబంధించిన కళ. ఇప్పటికే ఈ విద్య నేర్చుకోవడం కోసం సమంత 15 క్లాసులు తీసుకుందట. సినిమాలో ఈ సిలంబం టీచర్‌గా కనిపించబోతోంది. 'సుతంతిరా దేవి' ఈ సినిమాలో సమంత పాత్ర పేరు. బావుంది కదా. పాత్రలతో పాటు, పాత్రల పేర్లు కూడా చాలా బాగుంటున్నాయి. బావుండడంతో పాటు సమంత నుండి వస్తున్న సినిమాలన్నీ విజయవంతం కావడం మరో విశేషం.
ఏది ఏమైనా పెళ్లి తర్వాత హీరోయిన్‌గా సమంత ఇంత బిజీగా సినిమాలు చేస్తున్నందుకు ఆమె అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. అతి త్వరలో సమంత సస్పెన్స్ థ్రిల్లర్ 'యూటర్న్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.