'ఎక్కడికి పోతావు చిన్నవాడా' నిఖిల్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ మూవీ. వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన నిఖిల్ సినిమాల్లో కొన్ని సీక్వెల్స్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ కోవలో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా..' సినిమా కూడా ఉంటుంది. 'కార్తికేయ' సినిమాకి కూడా నిఖిల్ సీక్వెల్ చేయాల్సి ఉంది. అయితే, తాజా సమాచారం ప్రకారం నిఖిల్ నెక్స్‌ట్ చేయబోయే సినిమా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా..' అని తెలుస్తోంది. ప్రస్తుతం వి.ఐ.ఆనంద్ రవితేజతో 'డిస్కోరాజా' సినిమాతో బిజీగా ఉన్నాడు.
విలక్షణ కథలు ప్రిపేర్ చేసుకునే వి.ఐ.ఆనంద్, 'ఎక్కడికి పోతావు చిన్నవాడా..' సీక్వెల్ లైన్ ఎప్పుడో సిద్ధం చేసి ఉంచాడట. ఆల్రెడీ ఓ టీమ్ ఆ స్టోరీ లైన్‌ని డెవలప్ చేసే పనిలో కూడా ఉందని ఫిల్మ్ నగర్ టాక్. మొదటి పార్ట్‌ని మించి, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌ని ఈ సినిమాలో చూపించబోతున్నాడట డైరెక్టర్ వి.ఐ.ఆనంద్. 'డిస్కోరాజా' పూర్తి కాగానే, ఫైనల్ అవుట్ పుట్ పరిశీలించి, ఆ సినిమాని పట్టాలెక్కించే థాట్స్‌లో ఉన్నాడనీ తెలుస్తోంది. అంటే, హిట్ సినిమా సీక్వెల్‌తో నిఖిల్ ట్రాక్ ఎక్కాలనుకుంటున్నాడేమో.
ఇదిలా ఉంటే, ఈలోగానే నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' వాయిదాల పర్వం ముగించుకుని, ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. టి.సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది.