తెలుగమ్మాయిలకి తెలుగు సినిమాల్లో తగిన గుర్తింపు రావడంలేదనే చర్చ ఎప్పటినుంచో జరుగుతున్నదే. కానీ, తెలుగమ్మాయిలకు సరైన అవకాశాలొస్తే.. సంచలనాలు సృష్టించగలరు. అందుకే సీనియర్ నటి రేఖ నిదర్శనం. 'నేను తెలుగమ్మాయినే..' అని గర్వంగా చెప్పుకుందామె. అసలు విషయానికొస్తే, పదహారణాల తెలుగమ్మాయ్ ఇషా రెబ్బా నటించిన 'రాగల 24 గంటల్లో' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సత్యదేవ్, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్ తదితరులు ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం.
ఈ నెల 22న విడుదల కానున్న 'రాగల 24 గంటల్లో' సినిమాకి ప్రీ రిలీజ్ టాక్ చాలా పాజిటివ్‌గా కన్పిస్తోంది. ఇప్పటికే సినిమాని చూసిన కొందరు సినీ ప్రముఖులు, సినిమా చాలా బావుందని చెబుతున్నారు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గా ఇది తెరకెక్కిందనీ, సినిమాటోగ్రఫీతోపాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రధాన బలం అనీ అంటున్నారు. హీరోయిన్ ఇషా రెబ్బా తన నటనతో ఆకట్టుకుంటుందనీ, మిగతా నటీనటులంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారనీ తెలుస్తోంది.
క్వాలిటీ పరంగా చూసుకున్నా, సినిమా చాలా హై స్టాండర్డ్స్‌లో తెరకెక్కిందని ప్రీ రిలీజ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. షాట్ డివిజన్ దగ్గర్నుంచి, డైలాగ్స్ వరకూ, సౌండ్ ఎఫెక్ట్స్, లైటింగ్ వంటి విభాగాలు సినిమా కోసం చాలా బాగా పనిచేశాయనీ, రఘు కుంచె సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షన కానుందనీ తెలుస్తోంది. మొత్తమీద, ఈ ప్రీ బజ్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.