ఈ మధ్య సెన్సార్ బోర్డ్ పనితీరుపట్ల తరచూ విమర్శలొస్తున్నాయి. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడంలోనూ, కొన్ని సీన్లు కట్ చేయడంలోనూ బోర్డ్ తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పుడు వచ్చే సినిమాల్లో హింస, అశ్లీలత, మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అలాంటి విచ్చలవిడి సన్నివేశాలు ఉన్న సినిమాలకు ఎక్కువ వయసు రేటింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా ఆదేశ ప్రజల అభిప్రాయాలను స్వీకరించి, కొత్త గైడ్ లైన్స్ రూపొందించింది. 2019 లో నిర్ణయించిన 12A/12 కింద డివైడ్ చేసిన కొన్ని లైంగిక సన్నివేశాలను ఇప్పుడు 15 ఏళ్ల ఏజ్ రేటింగ్‌కు పెంచింది. అల్ రెడీ కొత్త మార్గదర్శకాలను అందుబాటులోకి తెచ్చినట్లు BBFC పేర్కొంది.
లాస్ట్ ఇయర్ సుమారు 12 వేల మందితో సర్వే చేసి, ఏ సినిమాలకు ఎంత ఏజ్ రేటింగ్ ఇస్తే బాగుంటుంది? అనే విషయాలపై విభిన్న వయసుల వారి అభిప్రాయాలు సేకరించింది. అందరి నుంచి వచ్చిన సమాధానము లైంగిక హింస అని తేలింది. అంతే కాకుండా గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువగా చూపిస్తున్నారని, వీటి వలన యువత తోవ తప్పుతున్నారని, ఈ నేపథ్యంలో BBFC డ్రగ్స్ సీన్స్ ఉన్న మూవీస్ కి తక్కువ ఏజ్ రేటింగ్ ను ఇస్తుంది.
అంతే కాదు సినిమాల్లో వాడే భాష విషయంలోనూ ఫిల్మ్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. లైంగిక, స్త్రీ ద్వేషపూరిత సినిమాలకు ఎక్కువ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. 'బిచ్ ఆఫ్ ఎ బిచ్,' 'బిచ్,' 'డిక్' వంటి పదాల విషయంలో కఠినంగా వ్యవహరించనుంది.