'శీనయ్య'గా మారిన వినాయక్‌.!

మరిన్ని వార్తలు

దర్శకుడిగా చిరంజీవి, ఎన్టీఆర్‌, చరణ్‌, ప్రబాస్‌, బన్నీ తదితర స్టార్‌ హీరోలతో సినిమాలు తెరకెక్కించిన వినాయక్‌, ప్రస్తుతం ఫామ్‌లో లేకపోతే లేకపోవచ్చు. కానీ, ఆయనలో విషయం ఇంకా దాగుంది. అందుకే దర్శకుడి నుండి, హీరోగా తనను తాను ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాడు. హీరో లుక్స్‌ కోసం తనవంతు కృషి చేసి, పట్టుదలతో తాను అనుకున్నది సాధించాడు. హీరోగా వినాయక్‌ నటిస్తున్న సినిమా పేరు 'శీనయ్య'. 'ది కంప్లీట్‌ ఎమోషన్‌' అనేది ఉపశీర్షిక. దసరా మరియు వినాయక్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు.

 

ఫస్ట్‌లుక్‌లో అచ్చు చిరంజీవిని తలపిస్తున్నాడు వినాయక్‌. మెడలో ఎర్ర తుండు, చేతిలో ఓ పెద్ద రెంచ్‌తో పవర్‌ఫుల్‌ మాస్‌ లుక్‌లో నడిచొస్తున్నాడు వినాయక్‌. దర్శకుడిగా ఎంతో మంది హీరోల్లో హీరోయిజం చూపించిన వినాయక్‌ ఇప్పుడు తనలోని హీరోయిజాన్ని బయట పెట్టబోతున్నాడు 'శీనయ్య' సినిమాతో. నరసింహ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్‌ రాజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌. కథ పరంగా ఈ సినిమాలో హీరో వినాయక్‌ అయితే బావుంటుందని పట్టు పట్టి వినాయక్‌ని ఈ సినిమాకి దిల్‌ రాజు ఒప్పించారని గతంలోనే వినాయక్‌ చెప్పారు.

 

సినిమాలో హీరో కాదు, కథలో కథానాయకుడు మాత్రమే కనిపిస్తాడట. అలా ఈ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి, దర్శకుడిగా వినాయక్‌ పవర్‌ ఏంటో అందరికీ తెలిసిందే. ఇక హీరోగానూ తన పవర్‌ చూపించాలని వస్తోన్న వినాయక్‌కి ఎలాంటి రిజల్ట్‌ వస్తుందో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS