బెల్లంకొండ సాయిశ్రీనివాస్-పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన "సాక్ష్యం" చిత్రం ఈనెల జూలై 27న విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదల హక్కులను ప్రఖ్యాత నిర్మాణ సంస్థ "ఎరోస్" సొంతం చేసుకొంది.
బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థగానే కాక పలు ప్రతిష్టాత్మక తెలుగు చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన ఎరోస్ సంస్థ ఇప్పుడు "సాక్ష్యం" హక్కులను కూడా సొంతం చేసుకోవడం విశేషం. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తుంది.
వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ కు విశేషమైన స్పందన లభించింది. బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి డూప్ లేకుండా పీటర్ హెయిన్స్ మాస్టర్ నేతృత్వంలో చేసిన రిస్కీ స్తంట్స్, పూజా హెగ్డే క్యారెక్టరైజేషన్, జగపతిబాబు క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.
అన్నిటికంటే ముఖ్యంగా.. శ్రీవాస్ చాలా డిఫరెంట్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో "సాక్ష్యం" ఓ మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతుండడం విశేషం.
- ప్రెస్ రిలీజ్