'దేవిశ్రీ ప్రసాద్' అంటే గుర్తొచ్చేది మ్యూజిక్ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్ పేరే. మెస్మరైజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీకి మంచి పేరుంది. ఈ సంగతి పక్కన పెడితే, ఈ పేరుతో ఇప్పుడు ఓ సినిమా రాబోతోందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్టర్స్ చాలా వల్గర్‌గా దర్శనమిస్తున్నాయి. టీజర్ కూడా చాలా వల్గర్‌గా కట్ చేశారు. మార్చురీలో ఓ అమ్మాయి డెడ్ బాడీతో ముగ్గురు యువకులు సెక్స్ చేస్తున్నట్లుగా చూపించారు ఆ టీజర్‌లో. అత్యంత దారుణం అది. అయితే టీజర్ అలా ఎందుకు కట్ చేయాల్సి వచ్చిందో సినిమా చూస్తే తెలుస్తుందట.
కానీ సినిమాలో ఏమాత్రం వల్గారిటీ అనేదే ఉండదంటోంది చిత్ర యూనిట్. దేవి, శ్రీ, ప్రసాద్ అనేవి మూడు పాత్రల పేర్లు. ఆ మూడు పాత్రల పేర్లు కలిపి 'దేవిశ్రీ ప్రసాద్' అనే టైటిల్ పెట్టారట. అయితే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌కి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఈ సినిమా ఏమాత్రం ఉండదంటున్నారు. సినిమాలో ఎక్కడా బూతు కానీ, వల్గారిటీ కానీ కనిపించదనీ ఓ మంచి సందేశాత్మక చిత్రం 'దేవిశ్రీ ప్రసాద్' అంటున్నారు. యూత్ మెచ్చే సినిమా అవుతుందంటున్నారు. యూత్‌కి కనెక్ట్ అయ్యే మెసేజ్ ఉంటుందట.
ఇప్పుడు కొన్ని సినిమాలు పబ్లిసిటీ నిమిత్తం టీజర్స్‌నీ, పోస్టర్స్‌నీ డిఫరెంట్‌గా డిజైన్ చేస్తున్నారు. తీరా సినిమా చూస్తే ఆ పోస్టర్‌కీ, సినిమాలో కంటెన్ట్‌కీ సంబంధం ఉండడం లేదు. ఆ తరహా కంటెన్ట్ ఉన్న సినిమానే ఈ సినిమా అంటున్నారు. అయితే కంటెన్ట్ బావుంటే, బూతు కూడా బాగానే వర్కవుట్ అవుతోందిప్పుడు. అయితే ఈ సినిమా కంటెన్ట్ ఏంటో, ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలంటే మరి కొద్ది రోజుల మాత్రమే వేచి చూడాలి. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముద్దుగుమ్మ పూజా రామచంద్రన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తోంది.