సుశాంత్ సరసన తెలుగు బ్యూటీ?

మరిన్ని వార్తలు

తెలుగు బ్యూటీ ఇషా రెబ్బా జర్నీ ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి పడుతుంది. కెరీర్ పరంగా తాను ఆశించినది ఒకటి.. ఆమెకు దక్కుతుంది ఇంకొకటి అట. అమ్మడు కూడా ఇదే ఫీలింగ్ లో ఉందట. తాజాగా 'రాగల 24 గంటల్లో'తో హిట్ అందుకున్నా ఆ స్థాయిలో తనకు గుర్తింపు రావడంలేదని అమ్మడు తెగ ఇదయపోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి మొదటి నుంచీ ఆమెకు అవకాశాలొచ్చినా ఆశించిన విజయాలైతే దక్కలేదు. దాంతో చివరికి ఈ అమ్మడు హాట్ స్టిల్స్ బాగా వదులుతుంది.

 

ఈ మధ్య ఈషా రెబ్బ హాట్ స్టిల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కూడా. అయితే ఈ తెలుగు బ్యూటీ తన గ్లామర్ తోనే కాకుండా తన లేటెస్ట్ సినిమా అప్ డేట్ తో కూడా వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ హర్రర్ థ్రిల్లర్ లో ఈషా నటించనుంది. ఈ సినిమాలో 'సుశాంత్' హీరోగా నటించనున్నట్లు.. ఈ సినిమాని వెంకట్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక 'అంతకు ముందు ఆ తరువాత' చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన, ఈ అచ్చ తెలుగమ్మాయి ఆ తర్వాత 'అమీతుమీ', 'అ', అరవింద సమేత లాంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

 

మరి ఇప్పుడు తనే ప్రధాన పాత్రలో ఓ హర్రర్ థ్రిల్లర్ తో రాబోతుంది. త్వరలోనే ఈ చిత్రం షూట్ కి వెళ్లనుంది. అయితే ఈ చిత్రంలో నటించే ఇతర తారాగణం గురించి, సాంకేతిక విభాగం గురించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS