ఒకరేమో 'మీకు మాత్రమే చెప్తా' అంటారు. ఇంకొకరేమో 'ఎవ్వరికీ చెప్పొద్దు' అంటారు.. ఏంటిదంతా..! అనుకుంటున్నారా? అవునండీ ఇవన్నీ సినిమా టైటిల్సే. కుటుంబ కథా టైటిల్స్, లవ్ టైటిల్స్, ట్రాజెడీ టైటిల్స్, హారర్ టైటిల్స్, హిట్ సాంగ్స్‌లోని జస్ట్ వన్ లైన్ టైటిల్స్.. ఇలాంటి టైటిల్స్ ఎన్నో చూసేశాం. ఇప్పుడా రోజులు పోయాయ్. ట్రెండ్ మారింది. కొత్త టైటిల్స్ వచ్చాయి. టైటిల్‌తోనే కొన్ని సినిమాలు ఆసక్తి పెంచేస్తున్నాయి. ఇక ప్రచార చిత్రాలతో సమ్‌థింగ్ డిఫరెంట్ కిక్ ఇస్తున్నాయి.
ఇంతకీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే, కొత్త సినిమా వస్తోందండీ. అందరూ కొత్త నటీనటులే. పేరు మాత్రం 'ఎవరికీ చెప్పొద్దు'. అబ్బా ఇదేనండీ సినిమా టైటిల్. 'ఎవరికీ చెప్పొద్దు' ఇంట్రెస్టింగ్ కదా. బసవ శంకర్ అనే కొత్త కుర్రోడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హీరో, హీరోయిన్లు కూడా కొత్తవాళ్లేననుకోండి. వారి పేర్ల సంగతి పక్కన పెడితే, సినిమాలో కంటెంట్ విషయానికి వచ్చేద్దాం. కుల పిచ్చ.. అదేనండీ క్యాస్ట్ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. హీరోయిన్ తండ్రికి క్యాస్ట్ ఫీలింగ్. క్యాజువల్‌గానే హీరోయిన్, హీరోగారితో లవ్‌లో పడుతుంది. క్యాస్ట్ విషయంలో వీరిద్దరికీ చిన్న క్లాష్ వస్తుంది.
ఇంతకీ మన హీరోది ఏ క్యాస్ట్.? తెలియాలంటే 'ఎవ్వరికీ చెప్పొద్దు' సినిమా చూడాల్సిందే. దసరా పండక్కి పండగలాంటి ఈ ఫన్నీ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అభిరుచి గల నిర్మాత మన దిల్ రాజు ఈ సినిమాని సమర్పిస్తున్నారు. సో సినిమాలో కంటెంట్ కనెక్టివ్‌గానే ఉంటుందని ఓ ఐడియాకి వచ్చేయొచ్చునన్న మాట. టైటిల్ 'ఎవ్వరికీ చెప్పొద్దు' అని ఉన్నా, అక్టోబర్ 8న ధియేటర్స్‌లో సందడి చేయనున్న ఈ సినిమా గురించి ప్లీజ్.. ఎవ్వరికీ చెప్పకుండా ఉండొద్దే.!