'డీజె - దువ్వాడ జగన్నాధమ్' సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు. అలాగే ట్రేడ్ పండితుల అంచనాలు కూడా మొదలయ్యాయి. మొదటి రోజు ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉండనున్నాయని ట్రేడ్ వర్గాల అంచనా. మేగ్జిమమ్ ధియేటర్స్‌లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. అంతేకాదు 'బాహుబలి' సెన్సేషన్ తర్వాత మరో పెద్ద సినిమా రాలేదు. చిన్నచిన్న సినిమాలు సందడి చేశాయి అంతే. ఆ కారణంగా కూడా ఈ సినిమా భారీగా వసూళ్లు సాధిస్తుందని లెక్కలు కడుతున్నారు. సినిమా కోసం భారీగా ఖర్చు చేశారు. అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. అంతేకాదు తెలుగుతో పాటు మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మలయాళంలో అల్లు అర్జున్‌కి సూపర్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. సో అక్కడ కూడా వసూళ్లు భారీగానే ఉంటాయని భావిస్తున్నారు. చిత్ర యూనిట్ అంతా ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇప్పటికే ఆడియన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. సినిమా ట్రైలర్‌లో కొట్టేస్తాం అంతే అని అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్, అదేదో సినిమా కోసం చెప్పిన డైలాగ్‌లా అనిపించడం లేదు. ఎంతో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. మొత్తానికి భారీ అంచనాల నడుమ రాబోతున్న ఈ సినిమాకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయినట్లే. మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.