పూరీ - బాలయ్య కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా 'పైసా వసూల్'. ఈ సినిమాలో ముగ్గురు భామలు హీరోయిన్లుగా నటిస్తుండగా, అందులో ముస్కాన్ ఒన్ ఆఫ్ ది హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మని ఏదో బిగ్ ప్రాజెక్టు వరించినట్లుంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్‌ని ఫ్యాన్స్‌తో విభిన్నంగా పంచుకుంది. త్వరలోనే బిగ్ న్యూస్ చెప్పబోతున్నాను అంటూ పోస్ట్ పెట్టింది. అయితే ఈ ముద్దుగుమ్మకి బాలకృష్ణతో నటించడమే వెరీ వెరీ బిగ్ న్యూస్. అలాంటిది ఇంకో బిగ్ న్యూస్ ఉందంటే అంతకు మించిన భారీ ప్రాజెక్టు ఏదో వరించి ఉండాలి. అయితే ప్రస్తుతానికి దానికి సంబంధించిన వివరాలేమీ చెప్పలేదు కానీ బిగ్ న్యూస్ అంటూ స్మాల్ హింట్ ఇచ్చి వదిలేసింది. ముస్కాన్ సేథికి తెలుగులో ఇదే తొలి సినిమా. తొలి సినిమాకే స్టార్ హీరో బాలయ్య సరసన ఛాన్స్ కొట్టేసిందంటే అమ్మడిని తక్కువగా అంచనా వేయలేం. ఏమో ఈ ముద్దుగుమ్మ కొట్టిన బిగ్ ఛాన్స్ ఏంటో ప్రస్తుతానికి సస్పెన్సే. ఈ సినిమాలో ముస్కాన్‌తో పాటు, శ్రియ, కైరా దత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలయ్యకు 101వ చిత్రం ఇది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ మధ్యే పోర్చుగల్‌లో బిగ్ షెడ్యూల్‌ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు డిఫరెంట్ గెటప్స్‌లో బాలయ్య కనిపించనున్నారు. సెప్టెంబరు 29న 'పైసా వసూల్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.