భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. సైనికుడి పాత్రలో కోపం ఎక్కువగా ప్రదర్శించే యువకుడిగా చూపించారు బన్నీని మొదట్లో. తర్వాత కూల్ అండ్ స్టైలిష్ కుర్రాడిగా చూపించారు. ఇంకా బన్నీలో చాలా వేరియేషన్స్ ఉన్నాయట. అవేంటో అంటూ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
రిలీజ్‌కి ముందే సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అవుతోంది. పబ్లిసిటీ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. 80 కోట్లకు పైగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనీ తాజా సమాచారమ్. వక్కంతం వంశీ ఎంతో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. సినిమా విజయంపై చాలా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు వక్కంతం వంశీ. అలాగే ప్రతీ సినిమాకీ ఏదో కొత్తదనం చూపించాలనే తపనతో ఎంతగానో కష్టపడే బన్నీ ఈ సినిమా కోసం ఇంతకు ముందెన్నడూ లేనంతగా కష్టపడి పని చేశాడట.
బాడీ లాంగ్వేజ్ నుండి, ఆటిట్యూడ్ దాకా మొత్తం మారిపోయిందట బన్నీకి ఈ సినిమాతో. డైరెక్టర్‌పై పూర్తి నమ్మకంతో కథలో ఉన్న బలాన్ని నమ్మి ఈ సినిమాకి మనస్పూర్తిగా అంత కష్టపడ్డానని బన్నీ చెబుతున్నాడు. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ బన్నీ మనసుకు బాగా కనెక్ట్ అయ్యాయట. వాటితో ఆడియన్స్ కూడా అలాగే కనెక్ట్ అవుతారట. దేశభక్తికి సంబంధించిన డైలాగ్స్ అంటే ప్రతీ ఒక్కరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటి సన్నివేశాలు, డైలాగులు చాలా చాలా ఈ సినిమాలో ఉన్నాయట.
ఈ సబ్జెక్ట్‌పై ఎన్నాళ్ల నుండో గ్రౌండ్ వర్క్ చేసి, సినిమాని తెరకెక్కించాడు వక్కంతం వంశీ. అందుకు తగిన రిజల్ట్ వస్తుందో లేదో చూడాలంటే మే 4 వరకూ ఆగాల్సిందే. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. రెండే రెండు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.