రెబల్ స్టార్ ప్రభాస్ - జక్కన్న రాజమౌళి కాంబినేషన్‌లో చాలాకాలం క్రితం వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా 'ఛత్రపతి'ని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. అదీ ఓ తెలుగు హీరోతో.. పైగా, ఆ చిత్రానికి దర్శకత్వం వహించేది కూడా తెలుగు దర్శకుడే. ఇది నిజంగానే, స్టన్నింగ్ అప్‌డేట్. తెలుగు సినిమా తన రేంజ్‌ని ఎప్పుడో పెంచేసుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్‌కి సవాల్ విసిరే స్థాయికి ఎదిగింది బాలీవుడ్.
అయితే, బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ తన స్టామినాని ప్రూవ్ చేసుకున్నాడు తప్ప, ఇంకో ఇతర టాలీవుడ్ హీరో కూడా ఆ స్థాయిలో ఇప్పటిదాకా సత్తా చాటలేకపోయాడు. అయితే, తెలుగు సినిమాల హిందీ వెర్షన్లు (రీమేక్‌లు) మాత్రం బాలీవుడ్‌లో బాగానే వర్కవుట్ అవుతున్నాయి. అదే సమయంలో, టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్‌లోనూ అద్భుతాలు సృష్టిస్తున్నారు.
'అర్జున్‌రెడ్డి' ఇందుకు మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి, 'ఛత్రపతి' హిందీ రీమేక్ ఏ స్థాయిలో వుండబోతోంది.? అంటే, ఆ సబ్జెక్ట్‌కి వున్న స్పాన్‌ని దృష్టిలో పెట్టుకుంటే, 'ఛత్రపతి' హిందీ రీమేక్ నిజంగానే ఓ సంచలనం కాబోతోందన్న చర్చ టాలీవుడ్ వర్గాల్లోనే కాదు, బాలీవుడ్ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. బడ్జెట్ పరంగానూ, క్వాలిటీ పరంగానూ ఎక్కడా రాజీపడకుండా హిందీ వెర్షన్ 'ఛత్రపతి'ని తెరకెక్కించబోతున్నారట. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడు. 'అర్జున్‌రెడ్డి'లా, 'బాహుబలి'లా, 'ఛత్రపతి' రీమేక్ కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని ఆశిద్దాం.