ఈమధ్య కాలంలో సోషల్ మీడియా లో సెలబ్రిటీలు పెట్టే పోస్టులు, చేసే ట్వీట్ల వల్ల చాలానే ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ ఈ జాబితాలో చేరింది. అయితే ఇందుకు గల కారణాలు ఏంటో చూద్దాం..
మొన్నీమధ్యనే మహానటి చిత్రం చూసిన రకుల్ ప్రీత్ తన ఆనందాన్ని అందరితో పంచుకునే క్రమంలో సినిమాలో నటించిన నటీనటుల గురించి ఒక ట్వీట్ పెట్టింది. ఈ మూవీ లో నటించిన కీర్తి సురేష్, సమంత, విజయ్ దేవరకొండ లు చాలా బాగా చేశారని ప్రశంసించింది. అయితే ఇందులో అందరి గురించి చెప్పిన రకుల్, హీరో దుల్కర్ సల్మాన్ గురించి మాత్రం చెప్పడం మరిచిపోయింది.
దీనితో ఆమె ట్వీట్ చూసిన దుల్కర్ అభిమానులు, తమ అభిమాన హీరో గురించి చెప్పకపోవడంతో రెచ్చిపోయారు. ఇక వెంటనే ఈ విషయమై రకుల్ ప్రీత్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు, తమ హీరో నీకు సినిమాలో కనిపించలేదా అంటూ ఎద్దేవా చేశారు. అయితే చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పినా దుల్కర్ అభిమానులు శాంతించటం లేదు.
మొత్తానికి ఒక చిన్న ట్వీట్ ఈ అమ్మడుకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది.