సూపర్‌స్టార్ మహేష్‌బాబు కొత్త రకం స్టైల్స్‌ని ఫాలో కాడు. రెగ్యులర్ స్టైల్‌లోనే కనిపిస్తుంటాడు. అయితే ఈ సారి మాత్రం మహేష్‌బాబు స్టైల్‌లో ప్రయోగం చేస్తున్నాడనే అనిపిస్తోంది. 'భరత్ అనే నేను' సినిమాతో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ తదుపరి చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే మహేష్‌బాబు కొత్త స్టైల్‌లో కనిపించబోతున్నాడట. అది కూడా పక్కా మాస్ లుక్ అని తెలుస్తోంది.
గుబురు గెడ్డంతో, పూర్తి మీసాలతో కనిపించబోతున్నాడట మహేష్‌బాబు. అందుకోసం మహేష్ ఆల్రెడీ మీసాలు, గెడ్డాలు పెంచడం మొదలెట్టేశాడట. గుబురు గెడ్డంతో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ గుబురు గెడ్డంతో రగ్గ్‌డ్ లుక్‌లో కనిపించి 'రంగస్థలం' సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ తరహా లుక్‌లోనే మహేష్ కనిపించబోతున్నాడనీ తెలుస్తోంది. బట్ స్మాల్ ఛేంజ్. చరణ్ పల్లెటూరి కుర్రాడుగా నటిస్తే, మాస్ లుక్ అయినా మహేష్ ఈ సినిమాలో ధనవంతుడిగా కనిపిస్తాడట.
చరణ్‌కి హిట్ ఇచ్చిన 'గెడ్డం' మహేష్‌కి కూడా కలిసొస్తుందో లేదో చూడాలి మరి. ఈ సినిమాలోనే మహేష్‌కి జోడీగా పూజా హెగ్దే నటిస్తోంది. కామెడీ హీరో అల్లరి నరేష్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహేష్‌కి పేదవాడైన స్నేహితుని పాత్రలో నరేష్ నటిస్తున్నాడట. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.