భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'శైలజారెడ్డి అల్లుడు' మిక్స్డ్ టాక్ని సంపాదించింది. దాంతో ఫస్ట్ షోలకే శైలజారెడ్డి అల్లుడు గట్టెక్కడం కష్టమే అనుకున్నారంతా. అయితే సాయంత్రానికి టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు జోరందుకున్నాయి. ఇప్పటిదాకా 12 కోట్లు గ్రాస్ సాధించిందనీ ట్రేడ్ పండితులు లెక్క తేల్చారు. అయితే వీకెండ్ కావడంతో శనివారం, ఆదివారం కూడా కలెక్షన్స్‌లో ఇదే జోరు ప్రదర్శిస్తుందనీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇకపోతే ఇంతవరకూ సాధించిన గ్రాస్ లెక్కకొస్తే, ఇది చైతూ కెరీర్లోనే బెస్ట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ అంటున్నారు. అన్నింటికీ మించి ఈ సినిమా సక్సెస్‌పై కొండంత ఆశలు పెట్టుకున్న అనూ ఇమ్మాన్యుయేల్‌కి ఈ ట్రేడ్ సమాచారమ్ కాస్త ఊరటనిచ్చింది. తొలిరోజు టాక్‌తో అనూ ఇక దుకాణం సర్దుకోవడమే అనుకున్నారు. కానీ రెండో రోజు పుంజుకోవడం, మూడో రోజు నుండే వీకెండ్ స్టార్ట్ కావడం మారుతిపై ఉన్న నమ్మకం ఇలా ఒక్కొక్కటీ అనుకూలంగా మారడంతో 'శైలజారెడ్డి' అనూ ఇమ్మాన్యుయేల్‌ని ఆదుకున్నట్లేనేమో అనిపిస్తోంది.
ఐరెన్ లెగ్ ఇమేజ్ నుండి ఫర్వాలేదనిపించుకునే అవకాశాలు లేకపోలేదనిపిస్తోంది. ఇక ఇదే రోజు విడుదలైన సమంత నటించిన 'యూటర్న్' చిత్రానికి టాక్ బాగానే వినిపించింది. ఈ ఏడాది సమంత కెరీర్లో మరో మంచి సినిమాగా యూటర్న్ నిలుస్తుందనే చెప్పాలి.
ఇక బాక్సాఫీస్ వద్ద ఫైనల్‌గా విజేతలెవరనేది మాత్రం కన్ఫామ్గా తెలియాలంటే ఇంకాస్త వెయిట్ చేయక తప్పదు.