'అజ్ఞాతవాసి' రికార్డులెలా ఉండబోతున్నాయంటే..!

మరిన్ని వార్తలు

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వస్తున్న 'అజ్ఞాతవాసి' సినిమా ఓవర్సీస్‌లో అత్యధిక ధియేటర్స్‌లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దాంతో అభిమానులు ప్రీమియర్స్‌ని దృష్టిలో పెట్టుకుని, వసూళ్ల కౌంట్‌ స్టార్ట్‌ చేసేశారు. ఇన్ని ధియేటర్స్‌లో విడుదలవుతోంది. ఇంత వసూళ్లు సాధిస్తుందంటూ అంచనాలు మొదలెట్టేశారు. 

తెలుగు రాష్ట్రాల్లో టికెట్‌ ధరలు పెరగనున్నాయట. ఈ విషయమై తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఇంతవరకూ జరిగిన ప్రీ బిజినెస్‌ దృష్ట్యా 'అజ్ఞాతవాసి' సినిమా నాన్‌ బాహుబలి రికార్డుల్ని ఈజీగా కొల్లగొట్టేస్తుంది. అయితే అంచనాలను బట్టి, 'బాహుబలి' రికార్డుల్ని కూడా 'అజ్ఞాతవాసి' కొల్లగొట్లేయనుందనీ ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ - పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌కున్న క్రేజ్‌ అలాంటిది. అందులోనూ ఈ సినిమాపై భారీ ఎత్తున నెలకొన్న అంచనాలకు మరో కారణం ఇటీవల రిలీజైన 'కొడకా కోటేశ్వర్రావ్‌ పాట..'. పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో ఈ తరహా జానపద పాటలకు ఉన్న క్రేజ్‌ సంగతి తెలిసిందే. 

అయితే ఈ పాట మరీ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌ని క్రియేట్‌ చేస్తోంది. సినిమాపై అంతవరకూ ఉన్న అంచనాల్ని ఈ పాట అమాంతం పెంచేసిందనడం నిస్సందేహం. కరుసైపోతావురా, పులుసైపోతావురా..లాంటి చాలా చాలా క్యాచీ వర్డ్స్‌తో పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా ఆలపించారు ఈ పాటని. ఈ పాటకి విదేశాల నుండి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. తాజాగా ఓ పోలండ్‌ కుర్రాడు పవన్‌ కళ్యాణ్‌ పాట చాలా బాగుందంటూ హ్యాష్‌ టాగ్‌ ఇస్తూ, తన స్టైల్‌లో ఆ పాటని పాడి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.. అదీ పవర్‌స్టార్‌ స్టామినా. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోందీ సినిమా. అనూ ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS