అమ్మాయిలకు షాపింగ్ అన్నా, మేకప్ అన్నా ఎంత ఇష్టమో తెలియంది కాదు. కానీ ఈ ముద్దుగుమ్మకి అవంటే అస్సలు ఇష్టం ఉండదట. సింపుల్‌గా ఉండడమంటేనే ఇష్టమంటోంది. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ ఏంటా సంగతి అనుకుంటున్నారా?
'ప్రేమమ్' సినిమాతో తెరంగేట్రం చేసిన క్యూట్ భామ అనుపమా పరమేశ్వరన్. ఈ సినిమా మలయాళంలో ఘనం విజయం సాధించి, అదే టైటిల్‌తో తెలుగులో రీమేక్ అయ్యింది. ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. కర్లింగ్ హెయిర్‌తో, క్యూట్ ఫీచర్స్‌తో కుర్రకారును భలే ఎట్రాక్ట్ చేసిందీ బ్యూటీ. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో బిజీగా గడుపుతోందిప్పుడు. మేకప్ అంటే ఇష్టం లేని ఈ బ్యూటీ అనూహ్యంగా సినిమాల్లోకి రావడం, తను హేట్ చేసే మేకప్‌తోనే ఎక్కువగా కనిపించడం.. అదంతా ఓ కలలా జరిగిపోయాయంటోంది.
ఏది ఏమైనా సినీ రంగంలోకి అడుగు పెట్టాక తన ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయంటోంది. సినిమాల్లో ఎలా కనిపించినా బయట మాత్రం సింపుల్‌గానే కనిపిస్తానంటోంది. అలాగే మరో విషయం ఏంటంటే తనకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టమట. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇంకా ఇష్టమంటోంది. ఒకవేళ యాక్ట్రస్ కాకపోయుంటే, వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్‌ని అయ్యేదాన్ననీ ముద్దు ముద్దుగా చెప్పేస్తోంది అనుపమా. 'అ,ఆ..'లో సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది.
గతేడాది సంక్రాంతికి 'శతమానం భవతి' సినిమాతో బిగ్గెస్ట్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుందీ మలయాళ కుట్టి. ప్రస్తుతం నానీ హీరోగా తెరకెక్కుతోన్న 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో నటిస్తోంది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఆ సినిమాలో తేజుకి జోడీగా అనుపమా నటిస్తోంది. ఇదో క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ.