క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌కి ఇప్పుడంతగా టైమ్ కలసి రావడం లేదు. 'ఇడియట్', 'పోకిరి' తదితర సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ కొట్టడమే కాదు, ఆయా హీరోస్‌కి తిరుగులేని స్టార్‌డమ్ తెచ్చిపెట్టిన క్రెడిట్ పూరీ హిస్టరీలో ఉంది. అంతెందుకు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ని తెరంగేట్రం చేయించిన ఘనత కూడా పూరీదే.
అలాంటి పూరీ జగన్నాధ్‌ని ఇప్పుడు ఏ హీరో నమ్మలేకపోతున్నారు. ఆయనను నమ్మి సినిమా చేయాలంటే భయపడిపోతున్నారు. స్టార్ హీరో బాలయ్య రిస్క్ చేశాడు కానీ, 'పైసా వసూల్' సినిమాతో. రిస్క్ రిస్క్‌లాగే మిగిలిపోయింది. ఆ సినిమా భారీగా నిరాశపరిచింది బాలయ్యని. ఇకపోతే, ఇవన్నీ కాదనుకున్నాడు కాబోలు. ఏకంగా తన కొడుకు ఆకాష్ పూరీతోనే రంగంలోకి దిగాడు. త్వరలోనే 'మెహబూబా' సినిమాతో ఈ తండ్రీ కొడుకులు ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఎందుకో ఈ సారి పూరీ మీద బాగానే అంచనాలు నెలకొన్నాయి 'మెహబూబా'తో.
కొడుకు ఆకాష్ పూరీ మంచి నటుడు. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గానే అది ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాకి హీరోగా మెచ్యూరిటీ కనబరుస్తున్నాడు. తండ్రి దర్శకత్వంలో కొడుకు ఒక స్టెప్ ముందుకేయడానికి సిద్ధపడుతుంటే, కొడుకు హీరోయిజంతో తండ్రి బౌన్స్‌బ్యాక్ అవ్వాలనుకుంటున్నాడు. ఈ తండ్రీ కొడుకులు చేస్తున్న యుద్ధంలో గెలుపు, ఓటములు ఇద్దరికీ ప్రభావం చూపిస్తాయి.
మే 11న 'మెహబూబా' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని ప్రమోట్ చేయడంలో పూరీ జగన్నాధ్ చాలా చాలా కష్టపడుతున్నాడు. తన సొంత బ్యానర్ అయిన పూరీ కనెక్ట్స్‌పై ఈ సినిమా రూపొందింది.