కాజల్‌ కాదు.. మాళవికా నాయర్‌

By iQlikMovies - May 07, 2018 - 19:05 PM IST

మరిన్ని వార్తలు

'స్టే ట్యూన్‌డ్‌ టు కాజల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌' అని బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కాజల్‌ ఉన్న ఓ లుక్‌ని రిలీజ్‌ చేశారు 'మహానటి' చిత్ర యూనిట్‌. దాంతో ఈ సినిమాలో కాజల్‌ కూడా నటించిందా? అనే అనుమానాలు తలెత్తాయి. మరి కాస్సేపట్లో కాజల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ నుండి హీరోయిన్‌ మాళవికా నాయర్‌ ఫోటో రిలీజ్‌ అయ్యింది. అంటే కాజల్‌ ట్విట్టర్‌ ద్వారా ఈ క్యారెక్టర్‌ని రిలీజ్‌ చేయించారన్న మాట. 

ఇంతకీ 'మహానటి'లో మాళవికా నాయర్‌ పోషించే పాత్ర పేరు అలమేలు. సావిత్రి భర్త జెమినీ గణేశన్‌కి మొదటి భార్య ఈవిడ. ఈవిడ సావిత్రిని చాలా బాగా చూసుకునేదట. సావిత్రి కూతురికి కన్యాదానం కూడా చేసిందట అలమేలు. అలా ఈ పాత్ర సినిమాకి చాలా కీలకమన్న మాట. అలమేలు క్యారెక్టర్‌ని రివీల్‌ చేస్తూ ఓ చిన్నపాటి టీజర్‌ని రిలీజ్‌ చేశారు. నాని వాయిస్‌ ఓవర్‌తో ఈ టీజర్‌ స్టార్ట్‌ అయ్యింది. మొత్తానికి అలా కాజల్‌తో 'మహానటి' సర్‌ప్రైజింగ్‌ టీజర్‌ని విడుదల చేశారు. 

నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'మహానటి' సినిమాలో సమంత, విజయ్‌ దేవరకొండ, మోహన్‌బాబు, నాగచైతన్య, దుల్కర్‌ సల్మాన్‌, షాలినీ పాండే, రాజేంద్రప్రసాద్‌, భానుప్రియ తదితర నటీనటులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, కీర్తి సురేష్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. 

మే 9న 'మహానటి' ప్రేక్షకుల ముందుకు రానుంది. అలనాటి మేటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచనాలున్నాయి. కాస్టింగ్‌ని బట్టి, సినిమా మేకింగ్‌పై మరిన్ని అంచనాలు నెలకొంటున్నాయి. చూడాలి మరి 'మహానటి' ఎలా ఆకట్టుకోనుందో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS