బాలీవుడ్‌లో ఇప్పటిదాకా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా 'దంగల్'. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రెజ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఇంతరకూ ఈ సినిమానే అత్యధిక వసూళ్లు సాధించింది బాలీవుడ్‌లో. అయితే ఈ సినిమా రికార్డుల్ని 'బాహుబలి' సినిమా కొల్లగొట్టేసింది. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన అనువాద చిత్రం 'బాహుబలి'. అయినా కానీ స్ట్రెయిట్ సినిమా లెక్కల్లో 'దంగల్'దే తొలి స్థానం. అయితే ఇప్పుడు కండల వీరుడు సల్మాన్ ఖాన్ 'ట్యూబ్‌లైట్' సినిమాతో వస్తున్నాడు. ఈ ఈద్‌కి ఈ సినిమా రానుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా 'దంగల్' రికార్డుల్ని కొల్లగొడుతుందా? లేదా అనే విషయం పక్కన పెడితే, ఈ సినిమా ఎంత హిట్ అయినా కానీ 'బాహుబలి' రికార్డుల్ని మాత్రం టచ్ చేయలేదని బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 'దంగల్' సినిమా చైనాలో విడుదలైన తర్వాత కూడా బాహుబలి రికార్డుల్ని టచ్ చేయలేకపోయింది. 2000 కోట్ల మార్కెట్‌కి రీచ్ అయ్యింది బాహుబలి. ఆ రికార్డుకి కొంచెం దూరంలో ఆగిపోయింది 'దంగల్'. ఇప్పుడు 'ట్యూబ్‌లైట్' వస్తోంది. ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి మరి.