సంక్రాంతి అల్లుళ్లూ కిర్రాకు పుట్టించేస్తున్నారు.!

మరిన్ని వార్తలు

సినీ ప్రియులకు ఈ సంక్రాంతి అసలు సిసలు పండగ కానుంది. ఈ ఏడాది సంక్రాంతికి ఇద్దరు మెగా హీరోలు బాక్సాఫీస్‌ వద్ద తలపడనున్నారు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ 'వినయ విధేయ రామ' అంటూ వస్తుంటే, మరో మెగా హీరో వరుణ్‌తేజ్‌ 'ఎఫ్‌ 2 - ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌'తో మెప్పించనున్నాడు. ఈ రెండింటిలో 'ఎఫ్‌ 2' గురించి మాట్లాడుకోవల్సి వస్తే, ఈ సినిమాలో వరుణ్‌తో పాటు, వెంకటేష్‌ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకుడు.

కాగా అనిల్‌ సినిమాలంటే ఫుల్‌ లెంగ్త్‌ ఫన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలతో డబుల్‌ ధమాకా ఇవ్వనున్నాడీ యంగ్‌ డైరెక్టర్‌. వెంకీ, వరుణ్‌లు తోడల్లుళ్లుగా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్లు చాలా ఎట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌తో ఏ రేంజ్‌ ఫన్‌ని పండించారో వీరిద్దరూ శాంపిల్‌గా చూపించేశారు. ఇక తాజాగా విడుదలైన ఫస్ట్‌ ఆడియో సింగిల్‌తోనూ అదే స్థాయిలో అకట్టుకుంటున్నారీ సంక్రాంతి అల్లుళ్లు.

'క్రికెట్‌ ఆడే బంతికి రెస్టే దొరికినట్లుందిరో.. 1947 ఆగష్టు 15 నేడే చూసినట్లుందిరో.. రెచ్చిపోదాం బ్రదర్‌..' అంటూ ఫన్నీగా సాగే ఈ పాటను లేటెస్టుగా విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్‌ ఇద్దరు ముద్దుగుమ్మలున్నారు. కానీ వారిద్దరినీ డామినేట్‌ చేసేలా ఉన్నారు మన హీరోలు. పోస్టర్స్‌లో కనిపిస్తున్న ఈ సందడి సంక్రాంతికి సినిమాలో చూపిస్తారో లేదో చూడాలి మరి. అన్నట్లు బాలయ్య ప్రధాన పాత్రలో వస్తున్న 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ కూడా ఈ సంక్రాంతికే విడుదలవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS