80కోట్ల కొరకు 'ఎఫ్‌ 2' పరుగు.!

By iQlikMovies - February 01, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

సంక్రాంతికి విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో ఇంకా ధియేటర్స్‌లో సందడి చేస్తోన్న 'ఎఫ్‌ 2', 20 రోజుల్లో 77. 16 కోట్లు వసూళ్లు కొల్లగొట్టింది. ఈ వీకెండ్‌కి 80 కోట్లు టచ్‌ చేసేయడం ఖాయమని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. నైజాంలో స్టార్‌ హీరోస్‌కి 20 కోట్లు బెంచ్‌ మార్క్‌ కాగా, ఆ బెంచ్‌ మార్క్‌ని ఈజీగా క్రాస్‌ చేసేసింది 'ఎఫ్‌ 2'. ఇక ఓవర్సీస్‌లో అయితే 9 కోట్లు వసూళ్లు కొల్లగొట్టింది. 

 

ఇదిలా ఉంటే, ఇప్పట్లో పెద్ద సినిమాలేమీ లేవు. ఈ నెల్లో 'యాత్ర' సినిమా విడుదలకు రెడీగా ఉంది. కానీ ఆ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అది 'ఎఫ్‌ 2'కు అడ్డంకి కూడా కాదు. సో ఈ వీకెండ్‌కి 80 కోట్లు టచ్‌ చేసేయడం ఖాయం. అంతేకాదు, త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లో కూడా 'ఎఫ్‌ 2' అడుగుపెట్టేస్తుందని అంచనా వేస్తున్నారు. 

 

వెంకీ, వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. నిర్మాతగా దిల్‌రాజు 'ఎఫ్‌ 2'తో భారీ హిట్‌ అందుకున్నాడు. మిల్కీబ్యూటీ తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించారు. అన్ని రకాల కమర్షియల్‌ హంగులతో పాటు వెంకీ, వరుణ్‌ల కామెడీ, అలాగే తమన్నా, మెహ్రీన్‌ల గ్లామర్‌ ఈ సినిమా విజయంలో మరింత హెల్ప్‌ అయ్యాయని చెప్పొచ్చు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS