బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఏకంగా ఐదుగురు హీరోయిన్లు ఉండబోతున్నారట. వారిలో కైరా అద్వానీ, రష్మికా మండన్నా పేర్లు ప్రధానంగా వినిపిస్తుండగా, మరో ముగ్గురు భామల పేర్లు కూడా జోరుగా ప్రచారంలో ఉన్నాయి. అనుపమా పరమేశ్వరన్, ప్రియా ప్రకాష్ వారియర్‌తో పాటు, మరో హీరోయిన్ కూడా ఉందట.
అయితే ఈ ఐదుగురిలో ఒక హీరోయిన్ మాత్రమే మెయిన్ హీరోయిన్ పాత్ర పోషించనుందట. మిగిలిన నలుగురూ గెస్ట్ రోల్స్‌లో సందడి చేయనున్నారట. అయితే ఆ మెయిన్ హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ప్రియా ప్రకాష్ వారియర్ విషయంలో బన్నీ ప్లానింగ్ మరోలా ఉందట. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ వారియర్‌కి యూత్‌లో ఉన్న క్రేజ్ సంగతి తెలిసిందే. ఆ క్రేజ్‌ని బన్నీ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడట.
ఇటీవల జరిగిన ప్రియా ప్రకాష్ వారియర్ 'లవర్స్‌డే' మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో బన్నీ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ టైంలోనే ప్రియాకి బన్నీ హామీ ఇచ్చాడట. తన సినిమాలో ఛాన్సిస్తానని. ఆ మాటను ఈ సినిమాతో నిలబెట్టుకోనున్నాడనీ తెలుస్తోంది. ఇక సినిమా మార్చిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ లోగా స్క్రిప్టు పక్కాగా ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగనున్నారట బన్నీ అండ్ త్రివిక్రమ్ టీమ్. ఈ సినిమాని హారికా హసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.