మూడో కథానాయకుడు దొరికాడా? లేదా?

మరిన్ని వార్తలు

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌3’ సినిమా త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్ళబోతోందంటూ చాలాకాలంగా గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. సినిమా స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా వున్నానని అనిల్‌ రావిపూడి గతంలోనే చెప్పాడు. ‘ఎఫ్‌2’లో ఇద్దరు హీరోలు నటించారు, ‘ఎఫ్‌3’లో ముగ్గురు హీరోలుంటారని దర్శకుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసిన విషయం విదితమే. ఆ మూడో హీరో ఇంకెవరో కాదు రవితేజ.. అంటూ కొన్నాళ్ళ క్రితం ఓ గాసిప్‌ వచ్చింది. ఆ తర్వాత అదంతా తూచ్‌ అంటూ, ఇంకో గాసిప్‌ వచ్చింది, ‘ఎఫ్‌3’లో నటించేందుకు మహేష్‌ ఒప్పుకున్నాడని పేర్కొంటూ. అయితే, ఈ విషయమై ఇంతవరకు పెదవి విప్పలేదు దర్శకుడు అనిల్‌ రావిపూడి.

 

ఇంకా ఆ ‘మూడో కథానాయకుడు’ విషయంలో క్లారిటీ రాలేదనీ, దాంతో కథ కూడా ముందుకు కదలడంలేదనీ తెలుస్తోంది. మూడో కథానాయకుడు ఎవరన్నదానిపై ఆధారపడి కథలో కొన్ని కీలక మార్పులు చేయాల్సి వుందట. అదీ అసలు సిసలు సమస్య. ‘ఎఫ్‌2’లో నటించిన వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ ‘ఎఫ్‌-3’లో కొనసాగడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏమో, ఏ క్షణాన ఈక్వేషన్స్‌ ఎలాగైనా మారొచ్చే. సరికొత్త కాంబినేషన్లు తెరపైకి రావొచ్చు. 100 కోట్లు ఆ పైన బడ్జెట్‌నీ డీల్‌ చేయగల స్థాయికి అనిల్‌ రావిపూడి చేరుకున్నాడు. సో, ‘ఎఫ్‌3’ ఇంకాస్త బిగ్గర్‌ ప్రాజెక్ట్‌ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS