నితిన్‌ వాడకం ‘రంగ్‌దే’లో కూడానా?

మరిన్ని వార్తలు

హీరో నితిన్‌, పవన్‌ కళ్యాణ్‌కి వీరాభిమాని. ఆ విషయం అందరికీ తెల్సిందే. తన సినిమాల్లో ఏదో ఒక రకంగా పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తావన వుండేలా జాగ్రత్తపడుతుంటాడు నితిన్‌. తన తాజా చిత్రం ‘రంగ్‌దే’ విషయంలోనూ నితిన్‌ అదే ఫాలో అవుతున్నాడట. పవన్‌ కళ్యాణ్‌ పాటల్ని రీమిక్స్‌ చేయడం నితిన్‌కి కొత్తేమీ కాదు. ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే జరుగుతోందా.? అంటే, ఔననే చర్చ సినీ వర్గాల్లో నడుస్తోంది. అయితే, పూర్తి పాట రీమిక్స్‌ చేయడంలేదట. ఓ పాటలో, పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించిన రిఫరెన్స్‌తోపాటు, పవన్‌ కళ్యాణ్‌ పాటల్లోని ఓ సూపర్‌ హిట్‌ పాట నుంచి కొంత భాగాన్ని లేపేశారట ‘రంగ్‌దే’ కోసం.

 

ఈ విషయాన్ని పవన్‌కి ముందుగానే నితిన్‌ చెప్పాడని అంటున్నారు. ‘రంగ్‌దే’ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న విషయం విదితమే. అన్నట్లు వెంకీ అట్లూరి, వరుణ్‌తో తెరకెక్కించిన ‘తొలి ప్రేమ’ సినిమా సూపర్‌ హిట్‌ అయిన విషయం విదితమే. అలా తన సినిమాకి పవన్‌ టైటిల్‌ని వాడేసిన వెంకీ అట్లూరి, ఇప్పుడు మళ్ళీ పవన్‌ ఇమేజ్‌ని తన కొత్త సినిమా ‘రంగ్‌దే’ కోసం వాడేసుకోవాలనుకుంటున్నాడన్నమాట. నితిన్‌ సరసన ‘రంగ్‌దే’ సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదితమే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS