గత సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 సంచలన విజయం సాధించింది. వంద కోట్ల క్లబ్బులో చేరిపోయింది. అప్పుడే ఎఫ్ 3 ఆలోచనకు అంకురార్పణ జరిగింది. ఎఫ్ 2 కంటే మిన్నగా ఎఫ్ 3ని రూపొందిస్తామని చిత్రబృందం చెప్పింది. ఎఫ్ 3లో మరో హీరో కూడా కనిపిస్తాడని ప్రచారం సాగింది. ఆ హీరో రవితేజనా? మహేష్ బాబునా? అనే చర్చ నడిచింది. మధ్యలో ఈ సినిమా నుంచి వెంకటేష్ డ్రాప్ అయ్యారని చెప్పుకున్నారు.
అయితే ఏమైందో ఏమిటో... ఇప్పుడు ఈ ప్లానులన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ఎఫ్ 2లో నటించిన వెంకటేష్, వరుణ్ తేజ్‌లే ఎఫ్ 3లోనూ కనిపిస్తారని తెలుస్తోంది. మూడో హీరో ఎవరూ ఉండరట. కథానాయికలు మాత్రం మారే ఛాన్సుందని సమాచారం. ఎఫ్ 3లో మరో కథానాయిక కూడా కనిపిస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆ మూడో కథానాయిక ఎవరో తెలియాల్సివుంది.