ఆదితో ఎన్టీఆర్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ సినిమాతో వినాయక్ హవా మొదలైంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన సాంబ యావరేజ్ మార్క్ దగ్గర ఆగిపోతే, అదుర్స్... సూపర్ హిట్ జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు వినాయక్ - ఎన్టీఆర్ కాంబోలో మరో సినిమా రాబోతున్నట్టు సమాచారం. `ఇంటిలిజెంట్` తరవాత మెగాఫోన్ పట్టలేదు వినాయక్. హీరోగా మారి - కెమెరా ముందుకు రావాలనుకన్నాడు. మధ్యలో బాలకృష్ణతో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నించాడు. ఇవేమీ వర్కవుట్ కావడం లేదు. దాంతో.. మళ్లీ మెగా ఫోన్ పట్టాలని ఫిక్సయ్యాడు.
ఇప్పుడు ఓ కథ కూడా రెడీ చేసుకున్నాడు. అది ఎన్టీఆర్‌కి వినిపించాలని భావిస్తున్నాడు. ఎన్టీఆర్ - వినాయక్ మధ్య మంచి అనుబంధం ఉంది. వినాయక్ ఎప్పుడు సినిమా తీద్దామన్నా.. ఎన్టీఆర్ రెడీనే. కాకపోతే.. ఇప్పుడు లెక్కలు మారాయి. వినాయక్ ఫామ్‌లో లేడు. దానికి తోడు ఎన్టీఆర్ కాల్షీట్లు అస్సలు ఖాళీగా లేవు. మరి.. వినాయక్ ఆశలు ఫలిస్తాయే, లేదో చూడాలి.