ఎఫ్ 2లో వెంకటేష్- వరుణ్‌తేజ్‌లు కలిసి చేసిన సందడిని మర్చిపోలేం. ఆ యేడాది బిగ్గెస్ట్ హిట్స్‌లలో అదొకటి. అందుకే ఇప్పుడు ఎఫ్ 3 కూడా పట్టాలెక్కేసింది. అనిల్ రావిపూడి చక చక సినిమాని తీసేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి రెండు నెలల బ్రేక్ వచ్చింది. `గని` సినిమా కోసం.. వరుణ్ తేజ్ బిజీ అయిపోయాడు. అందుకే.. ఎఫ్ 3 ఆగింది. ఈలోగా.. వెంకటేష్ కూడా `దృశ్యం 2` పూర్తి చేస్తాడట.
త్వరలోనే కేరళలో ఓ షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ అయితే.. దృశ్యం పని అయిపోయినట్టే. అటు గని, ఇటు దృశ్యమ్ రెండూ అయ్యాకే.. ఎఫ్ 3 మళ్లీ మొదలవుతుంది. అయితే ఈలోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలెట్టేద్దామన్న ఆలోచనలో ఉన్నాడు రావిపూడి. అంతేకాదు.. దేవిశ్రీ ప్రసాద్ ఇంకా ట్యూన్లు ఇవ్వలేదట. ఈ గ్యాప్‌లో ఆ పనులూ పూర్తయిపోతాయి.