వెంక‌టేష్ లేకుండానే ఎఫ్ 3...?

By Gowthami - March 01, 2020 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

ఎఫ్ 2... ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ ల కామెడీకి బాక్సాఫీసు ద‌ద్ద‌రిల్లింది. 2019 సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం ఆ యేడాది వ‌చ్చిన అతి పెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా నిలిచింది. అప్ప‌టి నుంచీ ఎఫ్ 3కి స‌న్నాహాలు మొద‌లైపోయాయి. 2021 సంక్రాంతికి ఎఫ్ 3 విడుదల కాబోతోంది. ఈ సినిమాలో వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్‌ల‌తో పాటు మ‌రో హీరో కూడా కనిపించ‌నున్నాడ‌ని చిత్ర‌బృందం చెప్పేసింది కూడా.

 

అయితే ఎఫ్ 3కి వెంక‌టేష్ స‌డ‌న్ షాక్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టు నుంచి వెంక‌టేష్ త‌ప్పుకున్నాడు. ఆ స్థానంలో ర‌వితేజ వ‌చ్చి చేర‌బోతున్నాడు. మూడో హీరోని ఇంకా వెదికి ప‌ట్టుకోవాలి. వెంక‌టేష్ ఎఫ్ 3 చేయ‌క‌పోవ‌డానికి కార‌ణాలేమిట‌న్న‌ది స్ప‌ష్టంగా తెలియ‌డం లేదు. కాక‌పోతే.. పారితోషికం విష‌యంలోనే వెంక‌టేష్‌కీ, దిల్‌రాజుకీ స‌ఖ్య‌త కుద‌ర‌ల్లేద‌ని, అందుకే వెంకీ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడ‌ని తెలుస్తోంది. వెంకీ లేకుండా ఎఫ్ 3ని ఊహించ‌డం క‌ష్ట‌మే. కామెడీ టైమింగ్ విష‌యంలో ర‌వితేజ ఎలాంటి లోటూ చేయ‌క‌పోవొచ్చు. కానీ... వెంకీని మాత్రం తెలుగు ప్రేక్ష‌కులు మిస్ అవ్వ‌డం ఖాయం. మ‌రి ఈ ప్రభావం ఎఫ్ 3పై ఎంత వ‌ర‌కూ ప‌డుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS