'పాగల్‌'గా మారిన 'ఫలక్‌నుమా దాస్‌'

మరిన్ని వార్తలు

'ఫలక్‌నుమా దాస్‌' చిత్రంతో హీరోగా, దర్శకుడిగా సంచలనం సృష్టించాడు విశ్వక్సేన్‌. ఇటీవల విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మనోడు, విజయ్‌ దేవరకొండ అభిమానుల్ని కెలికాడంటూ, వివాదాల్లోకెక్కాడు కూడా. మొత్తానికి విమర్శలూ, వివాదాలూ, ప్రశంసలూ.. ఇలా అన్ని రకాల ఫ్లేవర్స్‌ పుణ్యమా అని విశ్వక్సేన్‌ పేరు జనంలో బాగానే నానింది.

 

ఇక ఈ కాంట్రవర్షియల్‌ హీరో ఇప్పుడు మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. మొన్న 'ఫలక్‌నుమా దాస్‌' అన్నాడు. ఇప్పుడు 'పాగల్‌' అంటున్నాడు. ఈ సినిమాకి నరేష్‌ రెడ్డి కుప్పిలి దర్శకుడు. బెక్కం వేణు గోపాల్‌ నిర్మాతగా లక్కీ మీడియా బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. హీరోగానే కాకుండా, దర్శకుడిగానూ మనోడిలో మంచి టాలెంట్‌ ఉందన్న సంగతి డైరెక్టర్‌గా తొలి సినిమా 'ఫలక్‌నుమా దాస్‌'తో ప్రూవ్‌ చేసుకున్నాడు.

 

ఇక ఈ సారి మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఓ కొత్త లవ్‌ పాయింట్‌తో తెరకెక్కుతోన్న 'పాగల్‌' త్వరలో లాంఛనంగా ప్రారంభం కానుంది. రెగ్యులర్‌ షూటింగ్‌ సెప్టెంబర్‌ నుండి స్టార్ట్‌ కానుంది. హీరోయిన్‌ ఇతర టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS